ప్రజలకు శుద్ధమైన విజయ డైరీ పాలు
అందుబాటులోకి: అధర్ సిన్హా
సిద్ధిపేట యదార్థవాది
సిద్దిపేట పట్టణంలోని విజయ డైరీని, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య అభివృద్ధి, డైరీ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి సందర్శించారు…
ఆదివారం పట్టణంలోని విజయ డైరీ నిర్వహణ, పాల సేకరణ శీతలీకరణ ఇతర వివరాలను, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా వివరిస్తూ ఈ సందర్భంగా ఏప్రిల్ 1 నుండి పెరిగిన పాల సేకరణ ధరల వివరాల చార్టుల ఆవిష్కరించరు.. ఏడు శాతం వెన్న కలిగిన పాల ధరను ఈ సంవత్సరం 1 ఏప్రిల్ నుండి 55 రూపాయల నుండి 60 రూపాయలుగా పెంచడం జరిగిందని దానితో రోజుకు 32 వేల లీటర్ల నుండి 42 వేల లీటర్లకు పాల సేకరణ అభివృద్ధి చెందిందని తెలిపారు.. ఈ సందర్భంగా అధర్ సిన్హా మాట్లాడుతూ పాల సేకరణ ధర పెరిగినందున రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతున్నందున పాడి రైతులకు పెరిగిన పాల ధరల పై అవగాహన కలిగించి రోజువారి సేకరణ 60 వేల లీటర్లకు పెరిగేలా కృషి చేయాలని తద్వారా ప్రజలకు శుద్ధమైన పాలను మరింత అందించవచ్చు అని అన్నారు. కార్యక్రమంలో విజయ డైరీ సిద్దిపేట మేనేజర్ శ్రీజ, జూనియర్ మేనేజర్ మురళి, అసిస్టెంట్ మేనేజర్ రామస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.