ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడటమే సీపీఐ పార్టీ ప్రధాన ఎజెండా
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
ప్రజల కోసం పనిచేయడం,ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడటమే సీపీఐ పార్టీ ప్రధాన ఎజెండా అని,గ్రామ గ్రామన సీపీఐ పార్టీగా ప్రజల వద్దకు వెళదామని,పార్టీ బలోపేతం,నిర్మాణం మీద దృష్టి సారిస్థామని సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు..శనివారం రోజున సీపీఐ సిద్దిపేట నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం సిద్దిపేట పట్టణంలో సీపీఐ పట్టణ కార్యదర్శి గజాభీంకార్ బన్సీలాల్ అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల కాలంలో సామాన్య,పేద ప్రజల జీవన స్థితిగతులు అద్వాన్నంగా తయారు అయ్యిందని,బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బడా పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తూ దేశ సంపదంతా వారికి కట్టబెడుతుందని,ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తూ,దేశాన్ని అమ్మేస్తుందని మండి పడ్డారు.. కులాల మధ్య,మతాల మధ్య చిచ్చులు పెడుతూ,మత విద్వేషాలు రెచ్చగొడుతూ,లౌకిక దేశాన్ని హిందూ దేశాంగ మార్చాలని కుట్రలు చేస్తున్నారని,బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత సీపీఐ పార్టీగా మనదేనని,బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు..సీపీఐ పార్టీ జిల్లాలో అన్ని గ్రామాల్లో తిరగాలని ప్రజల స్థితిగతులను తెలుసుకోవాలని,పార్టీ నిర్మాణం,బలోపేతం దిశగా అడుగులు వేయాలని,పేద ప్రజలకు కూడు,గూడు కోసం సీపీఐ పార్టీగా పోరాడాలని పిలుపునిచ్చారు.. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ బీజేపీ పరిపాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అని,ప్రజలకిచ్చిన హామీలను పక్కన పెట్టి దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ,ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని ఆయన అన్నారు.. బీజేపీ ని ఓడించడానికి ప్రజాస్వామ్య, లౌకిక,ప్రజాతంత్ర,వామపక్ష శక్తులను ఏకం చేస్తామని,బీజేపీని గద్దె దించుతామని,ప్రజల బాగోగుల కోసం నిరంతరం ఉద్యమిస్తామని ఆయన తెలిపారు…అనంతరం సీపీఐ సిద్దిపేట నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్,కనుకుంట్ల శంకర్,సిద్దిపేట రూరల్ కార్యదర్శి మిట్టపల్లి సుధాకర్,ఎస్కె హరిఫ్,యాదగిరి,కళావతి,బంక రాజయ్య,ఏఐటీయూసీ నాయకులు కర్ణాల చంద్రం,పిట్ల మల్లేశం,బెక్కంటి సంపత్,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్థన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేష్,నవీన్,ప్రవీణ్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు..