ప్రజా సంఘాల ఐక్యవేదిక పోరాటం
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
ప్రజా సంఘాల ఐక్యవేదిక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండు పడకల ఇండ్లు ఇవ్వాలని, స్థలాలువున్నా వారికీ ఐదున్నర లక్షలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం సమర్పించారు..శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా రైతు సంఘం అద్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ సంవత్సరాలుగా ఇల్లు లేక అనేక అవస్థలు పడుతున్న నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడకల ఇండ్లు కట్టించి ఇస్తానని 8 సంవత్సరాలు గడుస్తున్న నేటికి నిరుపేద ప్రజల ఆశ ఆశాగానేవుందని, ఎంతో ఆశతో ఎదురు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ కట్టించి ఇవ్వాలని, స్థలాలువున్నా వారికీ ఐదున్నర లక్షలు ఇవ్వాలని, ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ సెక్రెటరీ సిద్ధాల నాగరాజు, వికలాంగుల ఐక్యవేదిక నాయకులు కుల్దీప్ శర్మ, ఐద్వా నాయకులు సరస్వతి, మస్రత్ బేగం, వేగం రేచల్ జ్యోతి, వృత్తిదారుల సంఘం నాయకులు సాయిలు, కెవిపిఎస్ నాయకులు అంబులెన్స్ రాజు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.