29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిది మెదక్

హవేళిఘనాపూర్ మండలం టి.మగ్దూంపూర్ లో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం సందర్శించి కంటి పరీక్షలు చేసుకుంటున్న వారిని వైద్యులు పరీక్షలు చక్కాగా చేస్తున్నారా కంటి అద్దాలు నాణ్యతగా ఉన్నాయా అద్దాలు పెట్టుకుంటే చూపు సరిగ్గా కనిపిస్తున్నదా అని ఆరా తీసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందున కంటి సమస్యలతో బాధపడుతున్న వారందరు కంటి పరీక్షలు చేసుకోవాలని కంటి చూపుకు సరిపోయే రీడింగ్ అద్దాలను అప్పటికప్పుడే ఇవ్వడం జరుగుతుందని ప్రిస్క్రిప్షన్ అద్దాలను వారం రోజులలో ఆశా కార్యకర్తలు ఇంటికే తెచ్చిస్తారని జూన్ 15 వరకు కొనసాగుతనని కంటి వెలుగు శిబిరాలకు అత్యధిక సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేలా గ్రామాలలో అవగాహన కలిగించలని తెలిపారు. ప్రతి రోజు కనీసం 150 మందికి పైగా స్క్రీనింగ్ చేసేలా ఆశా కార్యకర్తలు ఏ.యెన్.ఏం. లు మహిళా సంఘ సంఘ సభ్యులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 290 గ్రామా పంచాయతీలు 51 మునిసిపల్ వార్డులలో కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా నిర్వహించనని 2,91,336 మందికి కంటి పరీక్షలు పూర్తీ అయ్యాయని 29 గ్రామ పంచాయతీలు 3 వార్డులలో కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందు నాయక్ మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి తహశీల్ధార్ నవీన్ ఎంపిడిఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్