26.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
హోమ్తెలంగాణప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు 

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు 

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు 

ప్రతి 30 కిలో మీటర్లకు ఓ ట్రామాకేర్ సెంటర్‌

ప్రైవేట్ హస్పత్రులపై నిరంతర నిఘా

మంత్రి దామోదర రాజనర్సింహ

మహబూబ్‌నగర్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 22 :

గ్రామ సభల ద్వారా ప్రజల వద్దకి పాలనను ప్రజా ప్రభుత్వం  తీసుకొచ్చిందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.35 కోట్లతో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకున్నామని, ఒక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి, హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, రోడ్డు ప్రమాదాలలో కాని మరే ఇతర కారణం చేత లో గాయపడిన వారిని ప్రాణాలు కాపాడేందుకు ప్రతి 30 కిలో మీటర్లకు ఓ ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు‌ చేయబోతున్నామని, అందులో భాగంగా దేవరకద్రలోనూ ఓ ట్రామా కేర్ సెంటర్ రాబోతున్నదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మంచి విద్య, వైద్యం, సామాజిక భద్రతను అందించే బాధ్యత తీసుకుందని, ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్పిటల్స్‌లో సకల వసతులు కల్పిస్తున్నామని, ఆరోగ్యశాఖలో సంవత్సర కాలంలోనే సుమారు 8 వేల ఉద్యోగాలను నిపుకున్నమని ఈ ఘనత మీరిచ్చిన ప్రొత్బలంతోనేనని సాధ్యమైందని అన్నారు.. మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌లో కార్డియాలజి, నెఫ్రాలజీ వంటి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభించబోతున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడొద్దని, వారికి సమీపంలోనే డయాలసిస్ సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది కాలంలోనే కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, దేవరకద్ర, మక్తల్‌‌కు కొత్తగా డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశామని, ఒక్కో డయాలసిస్ సెంటర్‌లో 5 చొప్పున, పది డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రయివేట్ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేయాలని చూసే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గ్రామసభల రూపంలో ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చాం.. అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా వంటి అన్ని పథకాలు అందజేస్తామని, జాబితాలో మీ పేర్లు లేవని ఆందోళన చెందొద్దని మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామని, ప్రతి పేద కుటుంబానికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, దశలవారీగా అర్హులైన అందరికీ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్