ప్రధాని నరేంద్ర మోదీ తల్లి కన్నుమూత..
న్యూఢిల్లీ 30 డిసంబర్
అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హీరాబెన్ కన్నుమూత.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) మృతి చెందారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు.. గురువారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజును జరుపుకున్నారు. హీరాబెన్ మృతిపై ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని నా తల్లి ఈశ్వరుడి పాదాల వద్దకు చేరిందని. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది’’ అని ట్వీట్ చేశారు.
