ఓకెసారి సెలవు కలకలం.!
-మత్స్యశాఖలో అసలు ఏం జరుగుతుంది.!
-అధికారి వేదింపులా-సమన్వయ లోపమా.!
మెదక్ యదార్థవాది ప్రతినిది
జిల్లా మత్స్యశాఖ ఏడి వేదింపులు బరించలేక సిబ్బంది ముకుముడిగా సెలవు ప్రకటించారు. మెదక్ మత్స్యశాఖ జిల్లా కార్యాలయం ఏడి రజిని వేదింపులకు తాలలేక పోతున్నామంటూ సిబ్బంది సామూహిక సెలవు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏడి రజిని వేదింపుల పై సిబ్బంది రాజ్ మహేష్, భారత్, డేవిడ్ లు మాట్లాడుతూ సెప్టెంబర్ 20న ఏడి తీరుపై జిల్లా కలెక్టర్ కు సామూహిక కార్యాలయానికి రాలేమని వినతి పత్రం అందించమన్నరు. ఏడి వేధింపులతో మా మనో ధైర్యం సన్నగిల్లిందని మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని మేము ఇదే ఒత్తిడిలో ఆత్మహత్యలకు దారితీస్తుందేమోనన్న భయం నెలకొందని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి అయినా వెనకాడం.. ఈ అధికారి మాత్రం వద్దని కరాఖండిగా తేల్చిరు..