ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ సి బీ ఫోన్ నంబర్ల బోర్డు లు ఏర్పాటు చేయాలి.
జిల్లా అదనపు కలెక్టర్ కి వినతిపత్రం అందించిన సీసీఆర్ బృందం.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్ టి ఐ బోర్డ్ లతో పాటు ఏ సి బి అధికారుల ఫోన్ నంబర్ లతో కూడిన బోర్డు లు ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిల్ ఫర్ సిట్జెన్ రైట్స్ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీసీఆర్ జిల్లా అధ్యక్షుడు గుండ్ల శివ చంద్రం మీడియా స్టేట్ కోఆర్డినేటర్ సాజిద్ మాట్లాడుతూ పారదర్శక పాలన కోసం సీసీఆర్ సంస్థ పాటుపడుతుందని అన్నారు సీసీ ర్ జాతీయ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసిబి అధికారుల ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించామన్నారు. ప్రజలకు అంటి కర్రెప్షన్ బ్యూరో పై అవగాహన కల్పించడానికి, తమ హక్కులను కాలరాసే ఆధికారులపై ఫిర్యాదు చేయడానికి తప్పకుండా ఏసిబి బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు, అదనపు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించడమే కాకుండా అప్పటికప్పుడు ఫోన్ లో అధికారులతో మాట్లాడి ఏసిబి అధికారుల ఫోన్ నెంబర్ లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో సీసీ ఆర్ సభ్యులు శివ ఫారూఖ్ అలీ శ్రీనివాస్ రెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..