30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రమాదాల నివారణకే ట్రాఫిక్ సిగ్నల్స్

ప్రమాదాల నివారణకే ట్రాఫిక్ సిగ్నల్స్

ప్రమాదాల నివారణకే ట్రాఫిక్ సిగ్నల్స్

– ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహాజన్..

సిరిసిల్ల యదార్థవాది

ట్రాఫిక్ సమస్యల నివారణకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర పవర్ లూమ్ & టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా లతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి అధిక వాహనాల రాకపోకలు రద్దీ పెరిగిందని సిగ్నల్స్ వలన ప్రమాదాలను నియంత్రించవచ్చని, ట్రాఫిక్ రేగ్యులైజేషణ్, ట్రాఫిక్ మేనేజ్మేంట్ కు ఉపయోగపడుతుందని అన్నారు. ఒక సిగ్నల్స్ ఏర్పాటు వలన పది మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ కి సమానంగా ఉంటుందని ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు వలన ప్రమాదాల నివారణ, అధిక వేగంగా ప్రయాణం చేసేవారిని నియంత్రణ చేయవచ్చు అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు తో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు, పాదచారులకు ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు హెల్మెంట్ ధరించి వాహనాలు నడపాలని ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర పవర్ లూమ్ & టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు సిగ్నల్ వ్యవస్థను ఉపయోగించుకోవాలని, పట్టణంలో ట్రాఫిక్ నియాత్రణకు సిగ్నల్ వ్యవస్థను ప్రజల సౌకర్యం కోసం పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు..

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు నియాత్రణకు పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకు సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పీ విశ్వప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహశీల్దార్ విజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, లిడ్స్ ఫేస్ కంపెనీ అధికారి మురళి, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్