34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రశ్నాపత్రాలు లీక్ కాలేదు: మంత్రి సబితా

ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదు: మంత్రి సబితా

ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదు: మంత్రి సబితా

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

పదవ తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పదవ తరగతి పరీక్షల నిర్వహణపై 33
జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జి లు షానవాజ్ కాసీం, చంద్రశేఖర్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని ఈ పరీక్షల విషయంలో తమ స్వార్ధ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు అనుమానాలకు తావు లేదని తెలిపారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్.పి లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్ లను మూసివేయించాలని ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్