ఫార్మా పరిశ్రమలో ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
యదార్థవాది ప్రతినిధి సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫార్మా కంపెనీల్లో పెద్ద ఎత్తు కెమికల్స్ నిలువ ఉండడంతో మంటల దాటికి కెమికల్స్ డ్రమ్స్ పేలిపోతున్నాయి కార్మికులు మంటలు అర్పడానికి ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమ అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి మాచారం అందించడంతో నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.