బంజారాహిల్స్ లోని ఓ బట్టల దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. బట్టల షాపులో యువతి బట్టలు మార్చుకుంటుఉండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు. ఇది గమనించిన యువతి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు చేరుకొని ఆ ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు వారి నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.