29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణబండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం

బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం

బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం.. ప్రభుత్వ కుట్ర

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన రాస్తారోకో చేశారు. ఈ నిరసన కార్యక్రమములో బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బొమ్మ శ్రీరాం చక్రవర్తి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా  బండి సంజయ్ తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం ప్రజాస్వామ్య వ్యవస్థను కూనిచేయడమే అవుతుందని అన్నారు. ఇండియన్ పినాల్ కోడ్ ప్రకారం పార్లమెంటు సభ్యుడికి నోటీసులు కానీ పార్లమెంటు కమిటీకి సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు అరెస్టు చేయాలి వారెంట్ జారీ చేయకుండా పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అనైతికం దుర్మార్గమైన చర్యఅని అన్నారు.  వెంటనే బండి సంజయ్ విడుదల చేయాలని లేని పక్షంలో పెద్దయెత్తున ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమములో స్థానిక కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్ మ్యాదరబోయిన వేణు యాదవ్ కోమటి స్వర్ణలత జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్