34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణబండి సంజయ్ ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకోవాలి

బండి సంజయ్ ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకోవాలి

బండి సంజయ్ ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకోవాలి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28:

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఇందిరా గాంధీ, గద్దర్ పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలకు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే ఖబర్దార్ అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, తాజా మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో నీటికిచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటి పిలుపుతో మంగళవారం జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి  ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్  సూచనలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరు, పోటోతో ఇందిరమ్మ సంక్షే పథకాలను పేద ప్రజలకు అందిస్తుంటే బిజెపి నాయకులు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రజా యుద్ద నౌక గద్దర్ పట్ల ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదని ఇలాంటి వాఖ్యలు పునరావృతమైతే బయట తిరగనివ్వమని ఖబర్దార్ అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో సంక్షేమ పథకాలు పెడితే తప్పెమువందని ప్రశ్నించారు. మావోయిస్టులకు ఎంపి, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే తప్పు లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు గద్దర్ పేరును ప్రదిపాదిస్తే తప్పు వచ్చిందా అని చెప్పారు. పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా బిజెపి పార్టీ ఇస్తుందో బండి సంజయ్ సమాదానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ చరిత్రపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ చేసిన వాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో  యూత్ కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ ను బయట తిరగనివ్వరన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, నియోజకవర్గ అధ్యక్షులు జావిద్ బేగ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు సాయి, నాయకులు నాగుల వాసు, రుద్రంగి రవి, శబరి, పందిరి మల్లేష్, సాజిద్, శివ, నాని,సమీర్,నరేష్, అనిల్, సుదీర్, నాగారజు, మణికంఠ, రాపర్తి శ్రీనివాస్, సమీర్, వీరయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్