33.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణబాల్యమంటే ఒక చిరు నవ్వు..

బాల్యమంటే ఒక చిరు నవ్వు..

బాల్యమంటే ఒక చిరు నవ్వు..

-జిల్లాలో బాల కార్మికులకు విముక్తి..

-బాల్యం బంది కావద్దు.. బాల్యం ఎంతో విలువైనది..

-చిన్నారులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం..

-జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శి..

మెదక్ యదార్థవాది ప్రతినిది

జిల్లా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 66 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారని జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు..బాల్యమంటే ఒక నవ్వుల దొంతర ఆటపాటల పరంపర చిన్నారుల మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రియదర్శిని అన్నారు.. మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వారు మాట్లాడుతూ బాల్యమంటే ఒక నవ్వుల దొంతర అని ఆటపాటల పరంపరఅని ఆడినా పాడినా నడిచినా పరుగెత్తినా ప్రవహించే ఓ తుళ్లింతల వరదలా ఆశల మిలమిలలూ జిజ్ఞాసల తళతళలూ మేళవించిన ఒక ఉత్సాహపు జాతర.. మరి అందరి బాల్యం అలాగే ఉందా? .. అంటే లేదు. ఇప్పటికీ- చాలా కుటుంబాల్లో సహజమైన బాల్యాన్ని ఆ బాల్యపు వికాస క్రమాన్నీ బతుకు తెరువే ఓ బండ బరువై.. నిర్దాక్షిణ్యంగా బందీ చేస్తోందని వికసించి ప్రకాశించాల్సిన బాల్యాన్ని బలవంతంగా మసక బారుస్తోందని బడికి వెళ్లాల్సిన బాలలు కష్టతరమైన పనుల్లో కష్టపడటం సమాజాభివృద్ధికి ఆటంకంఅని జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉందని ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉన్నా.. ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్నదని దీన్ని రూపుమాపేందుకు ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ బృందం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేబర్ డిపార్ట్మెంట్ సఖి సెంటర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంటు అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులలో కిరాణం షాప్ లలో మెకానిక్ షాపులలో హోటళ్లలో పనిచేస్తూ వదిలివేయబడిన పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించామని తెలిపారు. అలాగే బాలలను పనిలో పెట్టుకున్న వారిపై 4 కేసులు నమోదు చేయడం జరిగిందని ఇందులో బాలురు 58, బాలికలు 08, పక్క రాష్ట్రాల బాలురు 11 మంది ఉన్నారని, చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహం లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న లేక వారితో బలవంతంగా పని చేయించిన ఒంటరిగా బాధపడుతున్న బాలలను చూసినప్పుడు పోలీసులకు తెలపాలని వారు అన్నారు.. శారీరకంగా మానసికంగా, లైంగిక దోపిడికి గురవుతున్న బాలలను చూసినప్పుడు 1098 లేదా డయల్ 100, 112 కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్