బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
మనకొండూరు యదార్ధవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్లేపల్లి, పెరకబండ, బెజ్జంకి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు శాసన సభ్యులు రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ లోకి చేరిన వారికి ఘన స్వాగతం పలికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపు మళ్లిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సబ్బండ వర్గాలకు అందుతున్న సంక్షేమ ఫలాలను స్వాగతిస్తూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొంటున్నారని తెలిపారు.