బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే మల్లి జైలుకే..
మంచిర్యాల 20 డిసంబర్2022
నిబంధనలు అతిక్రమించి మళ్లీ నేరం చేసినందుకు 2,00,000 రూపాయలు జప్తు చేయించిన మంచిర్యాల ఇన్స్పెక్టర్ నారయణ నాయక్ మంచిర్యాల లోని చున్నంబట్టివాడ ఏరియ కు చెందిన పురాణం రమేష్ తండ్రి పెంటయ్య పాత సామాను దొంగ సొత్తు అని తెలిసి కూడా వాటిని నిల్వ చేసుకొని అక్రమంగా తరలిస్తున్నాడని పురాణం రమేష్ పై కేసు నమోదు చేయశారు. మరొకసారి ఇలాంటి నేరం చేయొద్దని అతన్ని మంచిర్యాల ఎమ్మార్వో దగ్గర 30/11/2022 రోజున 2,00,000 రూపాయలు జప్తుకు బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. బైండోవర్ చేసిన నిబంధనలు ధిక్కరించి 13.12.2022 రోజున మళ్ళీ నేరం చేసినందుకు మంగళవారం మంచిర్యాల ఎమ్మార్వో ముందు పురాణం రమేష్ తండ్రి పెంటయ్య, వయస్సు 45 సంవత్సరాలు, కులం: బెడ బుడగ జంగం, వృత్తి: స్క్రాప్ బిజినెస్, చున్నంబట్టివాడ అను అతనిని ని హాజరుపరచగా రెండు లక్షల రూపాయలు కట్టవలసిందిగా నోటీసు ఇవ్వడం జరిగింది. ఇకనుండి మంచిర్యాల లో ఎవరైనా దొంగ సొత్తు అని తెలిసి కొన్న, అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇదివరకు బైండోవర్ అయినవారు మళ్లీ నేరం చేసినట్లయితే వారి నుండి రెండు లక్ష రూపాయలు జప్తు చేయించడం, వారి మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ నారాయణ తెలిపారు.