భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో రాష్ట్రస్థాయి పురస్కారం
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: భగవద్గీత జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించబడిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో సూర్యాపేటకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో బహుమతులు గెలుచుకున్నారని దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదివారం హైదరాబాద్ రామాంతాపూర్ అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో నవోదయ పాఠశాలకు చెందిన మహ్మద్ ఆయేషా ఫాతిమా, గైగుళ్ళ హేమశ్రీ విజయం సాధించారాని తెలిపారు. గత వారం సూర్యాపేటలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో గెలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపగా అక్కడ విజేతలుగా నిలిచారాని తెలిపారు. విద్యార్థులకు వారి తల్లితండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి వారు హృదయపూర్వకంగా అభినందనలుతెలియజేశారు.