భారతరత్నకు జేజేలు!
*నేటితో పురస్కారంలకు అర్ధ చేంచరి..
*2019 తర్వాత ఎవరికీ ఇవ్వలేదు..!
*రెండు సార్లు రద్దు..
*ఇద్దరు విదేశీయులు..
యదార్థవాది ప్రతినిధి
అదిగో.. భారతరత్న.. దేశంలోనే అత్యున్నత పురస్కారం..అందుకున్న వారికి.. ఓ పెద్ద నమస్కారం..!
ఏదో ఒక రంగంలో విశిష్ట సేవకు ఇచ్చే గౌరవం.. పద్మశ్రీ.. పద్మభూషణ్.. పద్మవిభూషణ్.. ఈ మూడింటినీ మించి మరో శిఖరం..
ఈ పురస్కారం…!
ఇంతటి అవార్డు చుట్టూ లేకపోలేదు వివాదాలు. రాజకీయం చేస్తున్నారని.. ఓటు బ్యాంకుగానూ మార్చేస్తున్నారని అయినా ఈ పురస్కారం.
మహోన్నతమే…!
ఇప్పటికి అందుకున్నది నలభై ఎనిమిది మంది. ఇద్దరు గాంధీలున్నా. సరిహద్దు గాంధీ కూడా చేరినా. మహాత్ముడు లేడెందుకో. జాతిపితకు రాలేదు కదా భారతరత్న. నోబుల్
ఆయనకు అంతకు మించి ప్రజాహృదయాల్లో స్థానం అంత ఉన్నతమైనది మహాత్ముని ప్రస్థానం..!
రాజాజీ బోణీ..
అప్పుడప్పుడు మారినా బాణీ భారతరత్న ఎప్పుడూ గొప్పదే అందుకునే వారికి అంతులేని యశస్సు భారతజాతి మొక్కుతుంది
వంచి శిరస్సు..!
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (సరిహద్దు గాంధీ) నెల్సన్ మండేలా
*జీవించి ఉండగా వందేళ్ల వయసులో అవార్డు అందుకున్న కేశవ కర్వే (వందేళ్ల వయసులో) ఆయన కోసం అవార్డు ప్రదానోత్సవం బొంబాయిలో జరిగింది. 1958లో
*అతి పిన్న వయస్కుడు ఏకైక క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ (40 ఏళ్ల వయసులో)
*నేతాజీకి ప్రకటించిన అవార్డు సాంకేతిక కారణాల వల్ల రద్దయింది..