భారత సంస్కృతి చాల గొప్పది:గవర్నర్ దత్తాత్రేయ
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
భారతదేశంలో రైతే రాజు మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని విశాఖపట్నం హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.. బిజెపి సీనియర్ నాయకులు ఉప్పిలి అప్పలకొండ స్వగృహంలో అల్పాహార విందులో గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ విభజన సమయంలో రెండు రాష్ట్రాలు మధ్య దూరంతో పాటు ప్రజల్లో మధ్య దూరం ఎక్కువవుతుందని అందరూ భావించారని, కానీ రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు మరింత దగ్గరవుతున్నారని ఆయన అన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళటం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తో పాటు పలువురు బిజెపి నాయకులు, యాదవ సంఘం నాయకులు, ఇతర అసోసియేషన్ సభ్యులు బండారు దత్తాత్రేయను సన్మానించారు..