భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలి: రెడ్ ఫ్లాగ్ డిమాండ్.
మచిలీపట్నం యదార్థవాది ప్రతినిధి
రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని యంయల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఏదుట రెడ్ ఫ్లాగ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నీతిఆయోగ్ ఆమోదించిన భూహక్కుల చట్టాన్ని ఏపి ప్రభుత్వం చట్టంగా తీసుకురావటాన్ని రెడ్ ఫ్లాగ్ తీవ్రంగా ఖండిస్తుందని కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకే ఈ చట్టమని జిల్లా కమిటీ కార్యదర్శి మేడక చోనాష్ మండిపడ్డారు. పేదల భూములు చుట్టూ పరిధిలోకి రాకుండా చేసి కోర్టులకు అతీతంగా ప్రభుత్వ ఆధీనంలోని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే చట్టమని చోనాష్ ధ్వజమెత్తారు. తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే రాబోయే రోజుల్లో అన్ని ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాజుల అనిల్ కుమార్ బత్తిన ఇంద్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.