మండల ఫోటోగ్రాఫర్ ఎన్నికలు.
గజ్వేల్ యాదర్తవాది ప్రతినిధి
కొండపాక మండల పరిధిలోని ఫోటోగ్రాఫర్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులుగా బ్రహ్మచారి ఉపాధ్యక్షులుగా నర్సింలు ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ కోశాధికారిగా కృష్ణ సలహాదారులుగా సంజీవ్ సురేందర్ కిషన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ తోటి ఫోటోగ్రాఫర్స్ కష్ట సుఖాలలో తోడు నిలుస్తూ మండలంలోని అందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంగం సభ్యులు వెంకటేశం లక్ష్మణ్ రవి సంపత్ స్వామి పరమేశ్వర్ సతీష్ విష్ణు నరేష్ తదితరులు పాల్గొన్నారు.