మంత్రి ఇలాకలో డాక్టర్లదే ఇష్టారాజ్యం
– తొమ్మిది మందికి ముగ్గురే విధుల్లో
– మందుల కోసం తప్పని తిప్పలు
– సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్
హుస్నాబాద్ యదార్థవాది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వంత జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లది రోజు ఇష్టారాజ్యం నడుస్తుంది వారంలో ఒక్క రోజు మాత్రమే డాక్టర్ లు డ్యూటీ చేసి మిగతా పని దినాల్లో స్వంత పనులు చూసుకుంటున్నారని భారత కమ్యూనిస్టుపార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ తెలిపారు. సోమవారం సిపిఐ ప్రతినిధి బృందం హుస్నాబాద్ 50 పడకల ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి వచ్చే రోగులను చూడడానికి డాక్టర్ లు సమయానికి ఆసుపత్రికి వస్తున్నారా వైద్య ఎలా అందుతుందని అడిగితెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి తో కలిసి ఆసుపత్రిలోని అన్ని వార్డూలు తిరిగిన అనంతరం గడిపె మల్లేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ లు అందరు రోజు విధులకు హాజరు కావడం లేదని వంతులవారిగా డాక్టర్ లు డ్యూటీలు చేస్తు ఆసుపత్రికి వచ్చిన వృద్దులైన రోగుల పట్ల డాక్టర్ సుమతి దురుసుగా ప్రవర్తించినతీరు సరైంది కాదని డాక్టర్ అంటే మానవత్వంతో పనిచేయాలని సూచించారు. వివిధ గ్రామాల నుండి ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు సరైన కూర్చుండే వసతులు, ఫ్యాన్ లు, డయాలసిస్ చేయించుకోవడం కోసం వస్తున్నవారి సంఖ్య అధికంగా పెరుగుతుండటంవల్ల అదనంగా మరో 6 బెడ్లు మంజూరు చేసి సంబంధించిన పరికారలను సమకూర్చి అందరికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. ఆసుపత్రిలో మందులు, వానాకాలం తలపిస్తున్న తరుణంలో పాము, తేలు, విషపు పురుగులు బారినపడేవారికొసం అదనంగా వ్యాక్సిన్, సూదులు, ల్యాబ్ కిట్లు చాలా కాలంగా నిల్వలు లేకపోవడం వల్ల డాక్టర్ లు బయటకు ప్రయివేటు మెడికల్ షాపులో దొరుకుతాయని తెచ్చుకోవాలని డాక్టర్ లు చిటిలు రాయడం సీఎం కేసిఆర్ స్వంత జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఇచ్చేందుకు సూది, మందులు, కిట్లు కూడా కరువైపోయాయని హుస్నాబాద్ ఆసుపత్రిపై ఎందుకింత చిన్నచూపు నిర్లక్ష్యం సరికాదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా కలెక్టర్, సంబంధిత వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ, అకస్మిక తనిఖీలు చేసి ఆసుపత్రికి అవసరమైన సూదులు మందులు, ల్యాబ్ కిట్లు సమకూర్చి పేదలకు మెరుగైన వైద్యం కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అందరూ రోజు విధులకు హాజరై ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడాలని డాక్టర్ లు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోజు విధులకు హాజరు కాకుండా రిజిస్టర్ లో సంతకాలు పెట్టుకునే సంస్కృతి ఇకనైనా మానుకోవాలని ఆయన డాక్టర్ లకు సూచించారు. కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు పొదిల కుమారస్వామి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జెరిపొతుల జనార్దన్, ఎఐవైఎఫ్ జిల్లా సహయ కార్యదర్శి చింతకింది కుమార్ సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.