మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కారు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ లో సదర్ ఉత్సవాలో పాల్గొనేందుకు సాయి యాదవ్ వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఆయన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతని కాలుకి గాయాలయ్యాయి స్థానికులు సాయి కారును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు పోలీసులు జోక్యం చేసుకుని గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి సర్దిచెప్పారు. పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.