మతసామరస్యతకి అద్దం పడుతున్న బస్వాపూర్
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్సాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా మతసామరస్యం వెళ్లివిరిసింది భక్తిశ్రద్ధలతో హనుమాన్ మండల దీక్ష చేస్తూ 41 రోజులు నిష్టగా ఉంటూ శ్రీరాముని హనుమాన్ నామస్మరణ చేస్తూ గ్రామస్తులు దీక్ష దారులు భారీగా తరలి వచ్చి ప్రతి సంవత్సరము ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సత్తయ్య ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ భక్తుల ఊరేగింపులో భాగంగా ముస్లిం సోదరులు మతసామరస్యతను చాటుతూ సోదర భావంతో ర్యాలీలో పాల్గొన్న భక్తులకు మజ్జిగను అందించడం గ్రామంలో ఆనవాయితీగా వస్తుంది.అదేవిధంగా ఈ సంవత్సరం హనుమాన్ దీక్షలు మరియు ముస్లిం సోదరులు యొక్క రంజాన్ పండగ కలిసి రావడం ముస్లిం సోదరులు భక్తి (ఉపవాసం) లో ఉండి ఎప్పటిలాగే భక్తి పారవశ్యంతో ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్తయ్య మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కొక్కుల రమేష్ సంపత్ కిష్టారెడ్డి సురేష్ వాజిద్ ముజ్జు ఇక్బాల్ సలీం నవీన్ శ్రీనివాస్ శ్రీకాంత్ రవి సింగరయ్య కిషన్ గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.