తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2216 మద్యం షాపులు ఉండగా తాజాగా రెండు వేల ఆరు వందలు 20 కి పెంచారు. ఇప్పటినుండి మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ అమలు కానుంది. మద్యం దుకాణాల్లో గౌడ్స్ కు 363, ఎస్సీలకు 262, ఎస్ టి లకు 131 ఓపెన్ కేటగిరీలో 1864 కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త మద్యం దుకాణాలకు మంగళవారం నుండి ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 20న డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు.