మన పల్లెలు ఆదర్శంగా ఉన్నాయి
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం గ్రామ పంచాయతీలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమాన్ని సర్పంచ్ పేర్యాల నవ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొత్త పంచాయితీ రాజ్ చట్టం తెచ్చి గ్రామ పంచాయితీ విధులు, నిధులు, బాధ్యతలు పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం , ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని స్వరాష్ట్రం రాకముందు పల్లెలన్నీ ఎలా ఉన్నాయో వచ్చిన తర్వాత ఎంతగా అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయో మనందరికీ తెలుసని అన్నారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తిస్తూ 16 మంది కార్మికులకు శాలువాతో సత్కరించరు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు ,ఉపసర్పంచ్ అశోక్ ,వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ఏఎన్ఎంలు, ఐకెపి సి ఏ లు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, వివోలు, గ్రామస్తులు పాల్గొన్నారు..