మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన : ఎమ్మెల్యే
మెదక్ యదార్థవాది ప్రతినిది
మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.. మెదక్ జిల్లా పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా వచ్చి స్థానిక రాందాస్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి సేవ చేశారని తన ఆశయాలకు మనం కట్టుబడి ఉండి ముందుకు తీసుకువెళ్లాలని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడని దేశంలోనే ఏనాయకుడు చేపట్టనటువంటి సంక్షేమ పథకాలు మన తెలంగాణాలో మాత్రమే వున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.