21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు

యదార్థవాది ప్రతినిది కూర్మన్నపాలెం

జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో వాడవాడలా సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా జీవీఎంసీ 87 వార్డు కణితి గాంధీ బొమ్మ దగ్గర ఆ వార్డు వైసిపి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహనికి పూల మాలలు వేసి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవాసులందరినీ ఏకతాటిపై నిలిపి, పరాయి పాలన నుండి భరతమాతను విముక్తి చేయడం కోసం సత్యం, అహింసలే ఆయుధాలుగా చేసుకుని, విజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిలో పోరాట స్ఫూర్తిని నింపినటువంటి మహోన్నత వ్యక్తి బాపూజీ అని కీర్తించారు. ప్రతీ ఒక్క భారతీయుడు మహాత్ముని స్మరించుకుని , అహింసా వాదుతో ఎంత కఠినమైన లక్షనైనా చేదించొచ్చని నిరూపించి వలసవాదాన్ని చేరి నుండి భారతవానికి విముక్తి కలిగించి ప్రపంచానికి నూతన పోరాట వరవడి నేర్పిన జాతిపిత మహాత్మా గాంధీ అని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు పయనించాలని అకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో ప్రగడ వేణుబాబు, మద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, ప్రగడ శ్రీనివాస్, సబ్బవరపు ఈశ్వరరావు, దాసరి అప్పడు, జాజుల శ్రీను, బోండా గోవిందరాజులు, బుల్లెట్ రమణ, దాకా సత్తిబాబు, బొడ్డ తాత, కొన్న అప్పలరాజు, ప్రకాష్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్