మహాత్మునికి ఘననివాళులు
యదార్థవాది ప్రతినిది మైలవరం నియోజకవర్గం.
విజయవాడ గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు, త్యాగాలను గురించి స్మరించుకున్నారు. జాతిపిత మహాత్ముడు సత్యాగ్రహం, అహింస, సహాయ నిరాకరణ, శాంతియుత పోరాటాలతో బ్రిటిష్ వారిని మనదేశం నుండి తరిమేసి మన దేశ పౌరులకు స్వేచ్చ, స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్య భూమిక పోషించారని, ప్రజలు ఆయన ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.