మహానేతకు ఘన నివాళి
-ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.
మిర్యాలగూడ, యదార్ధవాది ప్రతినిధి, డిసెంబర్ 27 : దేశానికి ముందుచూపుతో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మహా వ్యక్తి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. డా. మన్మోహన్ సింగ్ అకాల మరణానికి సంతాపం ప్రకటిస్తూ స్థానిక రాజీవ్ భవన్ లో వారి చిత్ర పటానికి పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా నెహ్రూ తర్వాత వరుస గా 10 ఏళ్లు ప్రధానిగా చేసిన ఘనత మన మన్మోహన్ సింగ్ దని, 1990 లో మన దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోతున్న సమయంలో ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.