
మహారాష్ట్ర పాఠ్యాంశాల్లో మన కీర్తి..
పాఠ్యాంశాల్లో బూర రాజేశ్వరి జీవితాన్ని పాఠంగా చేర్చాలి..మంత్రి కేటిఅర్
సిరసిల్ల 28 డిసంబర్
మహారాష్ట్ర లో విద్యార్థుల పాఠ్యాంశాల్లో బూర రాజేశ్వరి జీవితాన్ని పాఠంగా చేర్చిన సందర్భం లో మంత్రి ఐటి, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అభినందిస్తూ ట్వీట్. ఇక్కడ కూడా రాజేశ్వరీ స్ఫూర్తిదాయకమైన కథనీ తెలంగాణ విద్యార్థులకు పాఠ్యాంశo గా బోధించాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు. కాళ్ళతో కవిత్వం రాసి సిరిసిల్లాకు అరుదైన గౌరవం తెచ్చిన కవయిత్రి,బూర రాజేశ్వరి గారి మరణం సాహితీ లోకానికి తీరని లోటు. వైకల్యాన్ని అధిగమించి కవయిత్రిగా రాణించిన ఆమె జీవిత ప్రస్థానం యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.. అనంతర కాలంలో ఆమె స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని ఇక్కడ కూడా పాఠ్యాంశo గా చేర్చడం జరిగిందని మంత్రి అబినందించారు.