మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన:కే.వి సాగర్ బాబు
యదార్థవాది ప్రతినిది తిరుపతి
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్య నిర్వాహక అధికారి కే.వి సాగర్ బాబు..శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానంలో విశేష పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, ఆలయ ఏ.ఈవో. సతీష్ మల్లీ, ఆలయ సూపర్ డెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి మరియు వేద పండితులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.