మహిళలకు ఉచిత బస్సు రవాణా రద్దు చేయాలి.
కొండపాక యదార్థవాది
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిన మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఎర్పడింది అంటూ దుద్దెడలో ఆటో కార్మికులు ర్యాలీ తీశారు. దుద్దెడ మెయిన్ రోడ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపారు మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు ఎక్కువగా ఆటో ఎక్కుతారని ఇపుడు ఉచిత బస్సుసౌకర్యం కల్పించడంతో మా ఆటోలను తిప్పుకోలేక పోతున్నామని ఈ పరిస్థితుల్లో రోజుకు రెండు వందలు రూపాయలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు మహాలక్ష్మి స్కీంకు మేము వ్యతిరేకం కాదు కానీ ఈ స్కీమ్‌తో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.15 వేల జీవన భృతి కల్పించాలన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులకు ఉచిత విద్యా విధానం అమల్లోకి తీసుకురావాలన్నారు. ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలం నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని మా ప్రధాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు ఆరేళ్ల నర్సింలు, ఉపాధ్యక్షులు ఆరెపల్లి అంజి కోశాధికారి కాటపాక లింగం ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.