మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
మహిళలకు సరైన రక్షణ సముచిత స్థానం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ మహిళ పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్న వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ లో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి, మృతి చెందాక వారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వంలో కూడా మహిళ మంత్రులకు సరైన పదవి ఇవ్వలేదని మహిళలు ఆర్థికంగా రాణించేందుకు సీఎం కేసీఆర్ మహిళ ఇండస్ట్రియల్ ఉద్యోగాలు కల్పించడం లేదని అన్నారు మహిళలకు సమసిత ప్రాధాన్యం కల్పించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అతీక్ సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదారి మధు యువజన కాంగ్రెస్ నాయకులు గయాజుద్దీన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు