మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు
యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్
మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారిని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ నాగరాజు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నిజాంబాద్ లక్ష్మీ కళ్యాణ మండపంలో మహిళా పోలీస్ సిబ్బంది మరియు కాలేజీ విద్యార్థులతో కార్యక్రమంలో బుధవారం జిల్లా ఎస్పీ పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్ భరోసా ప్రతీ పి.యస్ లో ప్రత్యేక మహిళా విభాగం ఏర్పాటుచేసిందన్నారు మహిళల భద్రత కోసం నగరంలో త్వరలోనే భరోసా సెంటర్ అందుబాటులోకి తెస్తున్నామని అందులో వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలు సభ్యులుగా చేరుస్తామన్నారు నేడు మహిళలు అన్నింగాల్లో రాణిస్తూ,తమ సత్తాచాటుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఫాతిమా రాజ్ జయసుధ గిరిరాజు కిరణ్ కుమార్ నారాయణ సంతోష్ కుమార్ శ్రీశైలం శ్రీమతి సరళ మహిళా ఆర్.ఎస్.ఐ శ్రవంతి పోలీస్ కార్యాలయం సిబ్బంది, మహిళ హోమ్ గాడ్స్ కలేజి విధ్యార్థులు కళాశాలల విధ్యార్ధులు, పోలీస్ కళాబృందం పాల్గొన్నారు