21.7 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమహిళల భద్రతే లక్ష్యం

మహిళల భద్రతే లక్ష్యం

మహిళల భద్రతే లక్ష్యం

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణంలో సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళ భద్రతే “షీ టీమ్” లక్ష్యం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. విద్యార్థిని విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ సైబర్ క్రైమ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల రక్షణ షీ టీమ్ యెక్క ప్రాముఖ్యత విద్యార్థినులకు అవగాహన కల్పించరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మన దేశంలో ఎక్కడ లేనటువంటి ఆవిష్కరణలలో మహిళల రక్షణ భద్రత కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రతి జిల్లాలో షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళా సురక్షితంగా అంటే మహిళలకు మాత్రమే బాధ్యత కాదని అది అందరి బాధ్యతగా ఉండాలని ఎవరైనా విద్యార్థులను మహిళలను ఇబ్బందిలకు గురి చేయడం ఈవ్ టీజింగ్ చేసినప్పుడు వారిని మీరు ప్రశ్నించాలని అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని అన్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలను ఎవరైనా వెంబడిస్తే వెంటేనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కి సమాచారం అందివ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడటం జరుగుతుదని మైనర్ బాలికల పై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని విద్యార్ధిని విద్యార్ధుల సోషల్ మీడియా(ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్)కు దూరంగా ఉండాలని మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు సోషల్ మీడియా వేధింపులు ఆన్లైన్ వేధింపులు సైబర్ క్రైమ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి వేధింపులకు గురి కాబడే వారు చదువుకొని సాంకేతిక పరిజ్ఞానం తెలిసినవారే ఎక్కవగా బాధితులుగా ఉంటున్నారని జిల్లాలో సైబర్ నేరాల ఆన్లైన్ ఫ్రాడ్స్ మీదఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే వ్యక్తిత్వ వికాసం ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఇక్కడున్న పోలీసు అధికారులు ఉపాధ్యాయులు అందరూ ఇప్పుడు ఇలా మంచి హోదాలో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం చదువువని ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనంలో మంచిగా చదువుతూ యుక్త వయసు కాలేజీ జీవితంలోకి వచ్చాక విద్యపై నిర్లక్ష్యం తో జీవితం నాశనం చేసుకుంటారని సక్సెస్ అనేది ఒక కొలమానంతో కొలిచేది కాదని జీవితంలో క్రమశిక్షణ పాటిస్తూ పద్ధతి ప్రకారం జీవితం కొనసాగించడమే సక్సెస్ అన్నారు. మీ తల్లిదండ్రులు ఏదో రకంగా కష్టపడి పని చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగిందని ఎప్పుడు మర్చిపోకూడదని తల్లిదండ్రులను అర్థం చేసుకొని గౌరవిస్తూ వారి కోరికలను నెరవేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని ఎస్ పి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ విస్వప్రసాద్ సి.ఐ అనిల్ కుమార్ మండల విద్య శాఖ అధికారి రఘుపతి షీ టీమ్ ఎస్.ఐ ప్రేమ్ దీప్ ఎస్.ఐ లు రాజు శ్రీకాంత్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్