మహిళా బిల్లు చారిత్రాత్మకమైనదని. స్వాగతించిన తెలంగాణ లోక్ సత్తపార్టి.
_ అన్ని పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి.
_ సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్.
_స్వాగతించిన తెలంగాణ లోక్ సత్తపార్టి.
హైదరాబాద్ యదార్థవాది
దేశంలో జనాభాలో సగ భాగం వున్న మహిళల ప్రాతినిధ్యం చట్ట సభలలో ఇన్నాళ్లు లేకపోవడం ప్రజాస్వామ్యానికి మాతృ దేశంగా చెప్పుకొనే మన బారత దేశంలో పెద్దలోటు. జాతీయ బి.జే.పి. ప్రభుత్వం సాహసోపేతంగా బుధవారం పార్లమెంట్ ఉభయ సభలలో మహిళలకు చట్టసభలలో 33శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రవేశ పెట్టనున్నరు. “నారీ శక్తి వందన” మహిళా బిల్లు చారిత్రాత్మకమైనదని లోక్ సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు స్వాగతించారు. చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే భూస్వామ్య పెత్తందారీ పోకడలు పోయి సేవా ధోరణి అలవడుతుంది అని ఆయన అన్నారు. అంతే కాకుండా నిత్యావసరాలు, విద్య, ఆరోగ్యం, మహిళల భద్రత, ఉపాధి వంటి అంశాలపై ప్రభుత్వ ఆలోచనలు మారుతాయని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై అటక ఎక్కిన విషయం అందరికి తెలుసని ఇకనైనా దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలియజేయాలని అన్నిపార్టిలకు లోక్ సత్తాపార్టీ పక్షాన తుమ్మనపల్లి విజ్ఞప్తి చేశారు. సమాజంలోని ఆయా సామాజిక వర్గాల జనాభా ప్రాతపదికన సామాజిక న్యాయం పాటించేలా చట్టంలోనే నియమ నిభందనలు రూపొందించాలని ఆయన కోరారు.