25.5 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్తెలంగాణమాజీ ఎంపీ జమున మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన: కెసిఆర్

మాజీ ఎంపీ జమున మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన: కెసిఆర్

మాజీ ఎంపీ జమున మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన: కెసిఆర్

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ జమున మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని, తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడం లోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్నిపొందిన జమున గారు, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్