25.2 C
Hyderabad
Wednesday, October 15, 2025
హోమ్తెలంగాణమానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

సిద్దిపేట: 14 యదార్థవాది ప్రతినిది

దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన బండకాడి నర్సింలు కొన్ని రోజుల క్రితం చిట్టాపూర్ గ్రామం వద్ద ప్రమాదవషాత్తు బావిలో పడి మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులకు అండగా నిలబడతానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాటిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే 50,000 అందజేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం మిగతా 50 వేలు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం వారి కుటుంబసభ్యులకు సహాయం అందజేశారు. వారి కూతురు ఉన్నత చదువులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తన సొంత ఖర్చులతో చదివిపిస్తానని వారి కూతురు కోరిక మేరకు బీఎస్సీ నర్సింగ్ చదివిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్