మానవీయ తప్పిదం వల్లే ఇండ్లల్లోకి వరదనీరు: చాడ వెంకటరెడ్డి.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలోకి వరదనీరు రావడానికి మానవ తప్పిదమేనని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.. మంగళవారం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్, జాగీర్ సత్య నారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ సిపిఐ నాయకులతో కలిసి క్షేత్ర పరిశీలించారు. నాగారం రోడ్డులొ 2008లొ చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో 83 లక్షలతో నిర్మించిన వారద మల్లింపు కాల్వ నిర్మాణం చేపట్టారు.. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా అలాంటి పెద్ద కాల్వలు వుంటే మూడేళ్ల పట్టణంలోకి వరదనీరు వచ్చేది కాదని ఇది మానవ తప్పిదమేనని వెంటనే సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించలని, హుస్నాబాద్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుందని నేటి పరిస్థితులకు అనుగుణంగా ఎంతటి భారీ వర్షాలకైన పట్టణంలోని, ఇండ్లల్లోకి రోడ్లమీదికి వరద నీరు రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్, జాగీర్ సత్య నారాయణ,జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,మంద శ్రీనివాస్ భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, అక్కన్నపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జెరిపొతుల జనార్దన్,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి నేలవేణి స్వప్న, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల ఉపాధ్యక్షురాలు జంగ విజయ, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, గట్టు మల్లేశం కందరపు రాజు, తదితరులు పాల్గొన్నారు.