తెలంగాణ ఆంధ్ర సరిహద్దు గ్రామా అడవీప్రాంతంలో పెద్ద మొత్తంలో పందెం రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు తెలంగాణ ప్రాంతం వారితో కలిసి ఈ కోడిపందాలకు నాయకత్వం వహిస్తునట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సాగుతుండటంతో పోలీస్ లు విశ్వసనీయ సమాచారంతో స్థావరాల పై పెద్ద మొత్తంలో దాడి చేశారు. ఇరు ప్రాంతాల నిర్వాహకులు ఇక్కడ నుండి తప్పించుకున్నారు.
కోడిపందాలలో పాల్గొనేదుకు వచ్చిన వారి కోడి పుంజులు మోటార్ సైకిల్స్ పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. ములకలపల్లి మండలం, మంగలిగట్టు శివారు ఆంధ్ర సరిహద్దులో కొద్దిరోజులుగా కోడి పందాలు నిర్మావహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ములకలపల్లి- పాల్వంచ పోలీస్ లు, స్థావరాలపై దాడి నిర్వహించి 15 కోడిపుంజులు, 46 మోటార్ సైకిళ్ళు, ఆరుగురు పందెంరాయుళ్ల తో పాటు రూ. 14970 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.