ముక్కిన బియ్యం. … అంతా గోప్యం ఎందుకో..?
• అధికారుల నిర్లక్ష్యంతో పిడిఎఫ్ బియ్యం..
మెదక్ యదార్థవాది ప్రతినిధి
మెదక్ జిల్లా మండలం బొల్లారం గ్రామంలో ఉన్నటువంటి పిడిస్ నిల్వచేసే గోదాములలో సుమారు 2,900 కింటల్లా బియ్యం ముక్కి పోయి పురుగులు పట్టి ఎందుకు పనికి రాకుండా పోయాయి
సెప్టెంబర్ లో జరిగిన బదిలీలలో జిల్లాకు డిఎంగా వచ్చిన హరికృష్ణ ఈయన జిల్లా గోదాములలో నిలువంచిన బియ్యం పై తనిఖీ చేశారు. ఈ గోదాములలో ఉంచిన బియ్యం 2020 సంవత్సరం నాటిదని పూర్తిగా పాడైపోయినట్లు గుర్తించారు వీటిని నిలువ ఉంచారు. ఈ బియ్యాన్ని తినడానికి కూడా పనికిరాని రాదని ల్యాబ్ లో నివేదిక వచ్చిందని తెలియ వచ్చింది. వీటి విలువ సుమారు 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.. గోదాములలో నిలువ ఉంచే బియ్యం పై 15 రోజులకు ఒకసారి మలత యాన్ అనే మందు పిచికారి చేయాలి అలాగే మూడు నెలలకు అమోనియం ఫాస్పేట్ ఒకసారి పిచికారి చేయాల్సి ఉంటుంది. కానీ గతంలో చేసినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది కింద బియ్యం ముక్కిపోయి పురుగు పట్టి ఎందుకు పనికి రాకుండా పోయింది. కానీ ఇప్పుడు వచ్చిన అధికారులు ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ఆలోచనలో పడ్డారు. పూర్తి వివరాలను డిఎం త్వరలో తెలుపుతానని అన్నారు.