యదార్థ వాది ప్రతినిధి
అమరావతి: జీవో నెంబరు1పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు కొనసాగాయి.సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ..నిన్నటి వరకు జీవో నెంబరు 1ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జీవో నెంబరు 1పై కాంగ్రెస్, తెదేపా, భాజపా నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ముగ్గురు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రతిపక్షాల గొంత నొక్కేందుకే ప్రభుత్వం జీవో నెంబరు 1 తెచ్చిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.