తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘాన్ని కృష్ణ స్వామి ముదిరాజ్. స్థాపించి వంద సంవత్సరాలు నిండినది. అందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో ఆదివారం రోజున దుబ్బాక వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి జెండా ఎగరవేయడం జరిగింది. ముదిరాజులు రాష్ట్ర జనాభాలో ముదిరాజుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ముదిరాజులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల పై కరుణించి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని దుబ్బాక మండల అధ్యక్షుడు మాడబోయిన రాజు పేర్కొన్నారు







