మెదక్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు
* విజేతలకు రూ 10 వేల బహుమతి
* మైనం పల్లి శివాణి
మెదక్ యదార్థవాది ప్రతినిధి
సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే సతీమణి మైనం పల్లి శివాణి అధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 న మెదక్ పట్టణం లోని సిద్దార్థ స్కూల్ లో ముగ్గుల పోటీలు మహిళకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగుతాయి. పోటీలో గెలుపొందిన మొదటి విజేతకు రూ 10 వేలు, ద్వితీయ బహుమతి రూ 7500, ఉత్తమ ముగ్గులు వేసిన మారో ముగ్గురికి 5 వేల చొప్పున అందించనున్నట్టు వెల్లడించారు.. వీటితో పాటు పోటీలో పాల్గొన్న మహిళలకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందిస్తున్నట్టు తెలిపారు. పోటీలో పాల్గొనే మహిళలు ఎవరి రంగులు, వస్తువులు వారే తెచ్చుకోవాలి నిర్వాహకులు సూచించిన నిబంధనలు పాటించాలి తెలిపారు. ఇతర వివరాలకు 9908047659 భవాని, 9491674731 అనిత లను సంప్రదించాలని ఆమె తెలిపారు.