27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణయువత స్వయం కృషి తో ఎదగాలి

యువత స్వయం కృషి తో ఎదగాలి

యువత స్వయం కృషి తో ఎదగాలి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:

యువత స్వయం కృషి తో ఎదగాలని, వ్యాపారంగంలో రాణించాలని సూర్యాపేట డిఎస్పి రవి అన్నారు.  గురువారం  విద్యానగర్ బ్లూసి చౌరస్తా లో సుబ్బమ్మ పికిల్స్ సంప్రదాయ పచ్చళ్లు, పొడులు స్వచ్చమైన నెయ్యి విక్రయాల షోరూం  ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ కు చెందిన యువకులు సింగపంగ శ్రవణ్, వంటెపాక రవి వర్మలు నల్గొండ పట్టణంలో పికిల్స్ వ్యాపారం ప్రారంభించి, తమ మూడవ బ్రాంచ్ ను సూర్యాపేట లో ఏర్పాటు చేయడం పట్ల  అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుకాణ యజమానులు సింగపంగ శ్రవణ్, వంటెపాక రవి వర్మలు మాట్లాడుతూ తాము 2021 లో నల్గొండ లో సుబ్బమ్మ పికిల్స్, కారంపొడుల మొదటి బ్రాంచ్ ప్రారంభించి, రెండవ బ్రాంచ్ కూడ నల్గొండ లో మరియు తమ మూడవ బ్రాంచ్ సూర్యాపేట విద్యానగర్ నందు ప్రారంభించినట్లు చెప్పారు. తమ వద్ద నాణ్యమైన, రుచిగల  రోటి పచ్చళ్లు, నెయ్యి, కారం పొడులు,   కొబ్బరి పొడి, చిట్ల పొడి, కరివేపాకు కారం, అప్పడాలు,  లభిస్తాయని తెలిపారు. చికెన్, గోంగూర చికెన్, మటన్ గోంగూర మటన్, చేపలు, రొయ్యల పచ్చళ్లు తమ ప్రత్యేకత అన్నారు. తాము వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన పచ్చళ్లను వినియోగదారులకు అందుబాటు ధరలో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విహెచ్ పి జిల్లా అధ్యక్షులు  కారింగుల ఉపేందర్, పసునూరి దినేష్ బాబు, విజయ కృష్ణ, సందీప్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్