హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వెంకన్న అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చూశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, హాజరయ్యారు.
అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో నడక, వ్యాయామం, పరిగెత్తడం ఒక భాగం కావాలని ప్రతినిత్యం పరిగెత్తడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు.
ఎస్బి ఎస్సై రఘుపతి రెడ్డి మాట్లాడుతూ పరుగు పందాలు నిర్వహించడం వలన ఆత్మసంతృప్తి పొందుతామే తప్ప ఎలాంటి లాభాపేక్ష ఉండదని, అందరి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నిత్యం పరుగు పొందాలను నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. రాష్ట్ర, జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని, మహనీయుల పుట్టినరోజులను, వివిధ సందర్భాలను పురస్కరించుకొని నిత్యం పరుగు పందాలను నిర్వహించి, యువతను ప్రోత్సహించాలని నిర్వాహకులను కోరారు. అనంతరం హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వెంకన్న మాట్లాడుతూ నిత్యం పరిగెత్తడం వలన ఆరోగ్యంతో పాటు, ఏకాగ్రత పెరిగి, సత్ప్రవర్తన అలవాటు ఉంటుందని తెలిపారు. హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో రన్నర్స్ అసోసియేషన్ ను మరింత అభివృద్ధి పరుస్తానని,
హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్లో సభ్యత్వం పొందాలంటే 200 రూపాయలు చెల్లించాలని, చెల్లించిన ప్రతి వారికి హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ వ్యక్తిగత పేరుతో టీ షర్టును అందజేయడం జరుగుతుందని తీర్మానించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 1వ తేదీన పరుగు పందెం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిగల్ల రమేష్, వెంకన్న, డాక్టర్ ధర్మ, చింతకింది శ్రీనివాస్, మహేందర్, తిరుపతి నాయక్ నారాయణరెడ్డి, రామకృష్ణ, లక్ష్మణ్ నాయక్, బాబు, రాజేష్ సంజీవ్, నరేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.