రాజన్న సిరిసిల్ల బిడ్డలు రాష్ట్రంలో, దేశంలో అగ్రభాగాన ఉండాలి మంత్రి కేటీఆర్
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల బిడ్డలు రాష్ట్రంలో, దేశంలో అగ్రభాగాన ఉన్నారంటే మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులైనా తామంతా గర్వపడుతాం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే మూడు నెలలు బాగా కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. గిఫ్ట్ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పరిధిలో 2 వేల మంది ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ట్యాబ్‌లను చదువు కోసం ఉపయోగించుకోవాలి ఇందులో ఇంటర్నెట్ పెట్టి ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ పెట్టి వాటితో టైం వేస్ట్ చేయకండి మంచిగా చదువుకొని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్‌లతో పాటు ఇతర రంగాల్లో మంచి ర్యాంకులు సాధించండి. ప్రపచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతోనే మీకు ఈ ట్యాబ్‌లు అందజేస్తున్నాం గిఫ్ట్ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చిన్నారి తమ్ముళ్లు, చెల్లెళ్ల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని ఆకాష్ బై జూస్ సాఫ్ట్‌వేర్ ట్యాబ్‌లను విద్యార్థులకు అందజేస్తున్నాo ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. ఈ ట్యాబ్‌ల ద్వారా పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటిరీయల్‌ను అందజేస్తున్నాం. బయట కంటే ఈ ట్యాబ్ విలువ రూ. 10 వేలు అవుతుంది. మెటిరీయల్ విలువ రూ. 75 వేలు అవుతుంది. అంటే ఒక్కో ట్యాబ్ విలువ రూ. 86 వేలు.. దీన్ని ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు బాగా చదువుకుంటే.. మేమంతా సంతోషపడుతాం. గర్వపడుతాం అని అన్నారు.