రాష్ట్రస్థాయిలో రాణిస్తున్న సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు..
” జాతీయ గణిత దినోత్సవం ”
SCERT తెలంగాణ నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత సెమినార్ కు పి. రూపా రాణి, ఎస్ .ఎ .మ్యాథ్స్ జెడ్పిహెచ్ఎస్ సిరిసినగండ్ల, మం. కొండపాక , వి .అజయ్ కుమార్ రెడ్డి, ఎస్. ఎ.మ్యాథ్స్ , జడ్పీహెచ్ఎస్ కుకునూరుపల్లి, మం, సిహెచ్. ప్రదీప్ కుమార్ ,ఎస్జిటి, ఎంపీ యుపిఎస్ సంగుపల్లి ,ఎంపికైనారు. వీరిలో పి.రుపారాణి మరియు వి. అజయ్ కుమార్ రెడ్డి లు SCERT – TELANGANA వారు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించే రాష్ట్రస్థాయి గణిత సెమినార్ కు వరుసగా రెండుసార్లు ఎంపికై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం విశేషం .ఇటీవల నిర్వహించిన ఇన్స్పైర్ అండ్ సైన్స్ ఫెయిర్ లో ఉత్తమ టీచర్ ఎగ్జిబిట్ గా రాష్ట్రస్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది. గతంలో కూడా కరోనా సమయంలో యానిమేషన్స్ ఉపయోగించి అనేక మ్యాథ్స్ డిజిటల్ లెసన్స్ స్వయంగా తయారు చేసి విద్యార్థులకు ఆకర్షణీయమైన బోధనను అందించారు.